telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పురందేశ్వరి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఫిర్యాదు!

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మహిళా నేత పురందేశ్వరి విశాఖపట్నం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె అభ్యర్థిత్వంపై తెలుగుశక్తి అధ్యక్షుడు బీవీ రామ్‌ ఫిర్యాదు చేశారు. సోమవారం సచివాలయంలో సీఈవోను కలిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. పురందేశ్వరి ఎయిర్‌ ఇండియా డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ పోస్టుకు రాజీనామా చేయకుండా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని సీఈవోకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.

మరోవైపు భీమిలి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గత ఎన్నికల్లో తాను ఏమీ చదువుకోలేదని అఫిడవిట్‌లో రాశారు. ఈ ఎన్నికల్లో డిగ్రీ చదువుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై కూడా ఫిర్యాదు చేశాం.అయినప్పటికీ విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఈసీ, ఎన్నికలు పూర్తయిన తర్వాత తామేమీ చేయలేమని, కోర్టును ఆశ్రయించమని సూచించింది. పురందేశ్వరి, ముత్తంశెట్టి అభ్యర్థుల వ్యవహారం పై కోర్టు ను ఆశ్రయించనున్నట్టు బీవీ రామ్‌ తెలిపారు.

Related posts