• Home
  • Trending Today
  • దిల్ రాజును భయపెడుతున్న “అరవింద సమేత”
Trending Today సినిమా వార్తలు

దిల్ రాజును భయపెడుతున్న “అరవింద సమేత”

Dil Raju

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘అరవింద సమేత’. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు త్రివిక్రమ్. నిన్ననే ఈ చిత్రం విడుదలై విజయవంతంగా దూసుకెళ్తోంది. ఇక అమెరికాలో అయితే “అరవింద సమేత” కలెక్షన్లు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఈ చిత్రం సాధించిన మొదటి రోజు కలెక్షన్లు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అరవింద సమేత 25 కోట్ల షేర్స్ ను సాధించింది. ఇక కర్ణాటకలో రూ.5.26 కోట్ల వరకు షేర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు శాటిలైట్ రైట్స్ కూడా భారీగానే అమ్ముడుపోయాయి.

ఈ సినిమా విజయం ఇప్పుడు “హలో గురు ప్రేమకోసమే” చిత్రానికి పరీక్షగా మారింది. ఇప్పటికే విడుదలైన చిత్ర ఆడియో కు , అలాగే ట్రైలర్ కు పెద్దగా స్పందన బాగానే వచ్చింది. కానీ ఇప్పుడు అరవింద కు బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అని రాజు భయపడుతున్నట్లు తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 18 న విశాల్ పందెం కోడి 2తో వస్తున్నాడు. ఇంతకుముందు పందెం కోడి మొదటి పార్ట్ విజయవంతం కావడంతో ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. అందుకే రామ్ కు గట్టి పోటీనే ఉండబోతోంది.

Related posts

15వ తేదీనే సంక్రాంతి..

admin

ప్రజాస్వామ్య పుట్టింటిని తాకిన మీటూ…మహిళల పట్ల 200 మంది

nagaraj chanti

కన్నడ నటుడు కాశీనాథ్ కన్నుమూత..

admin

Leave a Comment