telugu navyamedia
andhra news political

చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు వామపక్షాల డుమ్మా!

Chandrababu fire sakshi media

రాజధాని ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోమవారం తలపెట్టిన ధర్మపోరాట దీక్షకు దూరంగా ఉండాలని వామపక్షాలు నిర్ణయించాయి. బాబు ఢిల్లీ దీక్షకు తాము రాలేమని సీపీఎం, సీపీఐ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ స్పష్టం చేశారు. హోదా కోసం ఆందోళన చేసినప్పుడు తమ పార్టీల కార్యకర్తలను చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో కొట్టించి కేసులు పెట్టించిందని గుర్తు చేశారు. అప్పుడు పెట్టిన కేసులు ఇంతవరకు ఎత్తివేయలేదని, తమ కార్యకర్తలు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో చంద్రబాబు చేస్తున్న హడావిడి రాజకీయ ప్రయోజనం కోసమేనని సీపీఐ, సీపీఎం తీవ్రంగా ఆక్షేపించాయి. సీఎం అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించకుండా హోదాయే కావాలని పోరాటానికి దిగి ఉంటే తామంతా మద్దతు పలికేవారమని పేర్కొన్నారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చి చంద్రబాబును తిట్టిపోతే రేపు బాబు ఢిల్లీ వెళ్లి ప్రధానిపై దుమ్మెత్తిపోస్తారని, వీటితో ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

Related posts

రెండేళ్లలో .. పోలవరం సిద్ధం చేస్తాం.. : ఏపీ నీటిపారుదల మంత్రి

vimala p

వస్తు పన్ను పెంచారంటూ అగ్రరాజ్యం ఏడుపు .. మోడీ తో తేల్చుకుంటా..అంటున్న ట్రంప్ ..

vimala p

ఆ పార్టీతో పొత్తు లేదు.. తేల్చేసిన కాంగ్రెస్..

vimala p