telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెట్టింట్లో హీరో భారీ యాక్షన్ ఇంట్రడక్షన్ సీన్ ప్రత్యక్షం

Commando

హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన యాక్షన్‌ స్టార్‌ విద్యుత్‌ జమ్వాల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కమాండో 3. సూపర్‌ హిట్ అయిన కమాండో సిరీస్‌లో మూడో భాగంగా వస్తున్న ఈ సినిమాలోని హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేశారు. కమాండో తొలి భాగంలో తన ప్రేమ కోసం పోరాడిన హీరో.. సీక్వెల్‌లో దేశానికి తీవ్ర నష్టం చేస్తున్న బ్లాక్‌ మనీ రాకెట్‌ మీద యుద్ధం చేశాడు. తాజా సీక్వెల్‌ కమాండో 3లో హీరో టెర్రరిజం మీద యుద్ధం చేయనున్నాడు. ఈ సినిమాకు ఆదిత్య దత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. విద్యుత్‌కు జోడిగా అదా శర్మ నటిస్తున్న ఈ సినిమాలో అంగీరా దర్‌, గుల్షన్‌ దేవాయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌, మోషన్‌ పిక్చర్‌ క్యాపిటల్‌, సన్‌ షైన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నవంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం నెట్ట్టింట్లో ఈ హీరో ఇంట్రడక్షన్ వీడియో వైరల్ గా మారింది.

Related posts