telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో విషాదం…ప్రముఖ నటుడు వివేక్ కన్నుమూత…

2020 సంవత్సరం చిత్ర పరిశ్రమను కుదిపేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్ట పోగా.. ప్రముఖ నటులు 2020లోనే మృతి చెందారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.  అయితే తాజాతమిళ హాస్య నటుడు వివేక్ (59) మృతి చెందారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు. నిన్న ఉదయం 11 గంటలకు వివేక్ గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వివేక్.. దాదాపు 300 కు పైగా సినిమాల్లో నటించాడు. దర్శక శిఖరం కె. బాలచందర్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ ఒకరు. “మనదిల్ ఊరుది వేండం” సినిమా ద్వారా ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు పెద్ద హీరోలందరితో కలిసి నటించారు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ సినిమాల్లో నటించి.. సినిమా ప్రియులను నవ్వించాడు వివేక్. గా  

Related posts