telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాకింగ్ లుక్ లో స్టార్ కమెడియన్

Vennela-KIshore

ఇప్పుడు తెలుగులో స్టార్ కమెడియన్ ఎవరంటే వెన్నెల కిషోర్. తాజాగా వెన్నెల కిషోర్ తనకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలో వెన్నెల కిషోర్ షాకింగ్ లుక్ లో ముసలివాడిగా కన్పిస్తున్నాడు. ఈ ఫొటోకు మంచి స్పందన లభిస్తోంది. ఇన్స్టాలో పెట్టిన ఈ పోస్టుకు సెలబ్రెటీలు కూడా సరదాగా స్పందిస్తున్నారు. వెన్నెల ఎలా కన్పించినా కామెడీకి మాత్రం ఏం తక్కువ ఉండదని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ కామెడీ చేస్తున్నామంటూ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫోటో ఎలా వచ్చిందంటే… ఇటీవల కొత్తగా వస్తున్న అనేక యాప్ లు సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తున్నాయి. మన ఫోటోను అప్ లోడ్ చేస్తే.. ఏ వయస్సులో ఎలా ఉంటామో చూపించే యాప్ లు ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. తాజాగా టీమిండియా క్రికెటర్స్ ను ఈ యాప్ ఉపయోగించి వాళ్లు ముసలి వయస్సులో ఎలా ఉంటారో చూపించిన పిక్స్ బాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.

Related posts