telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ హాస్యనటుడు గుండెపోటుతో మృతి

vadvel

ప్రముఖ హాస్యనటుడు వడివేల్‌ బాలాజీ గుండెపోటుతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. చిన్న వయస్సులోనే బాలాజీ అకస్మికంగా మృతి చెందడంతో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. వడివేల్ బాలాజీకి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్న బాలాజీని ఆ తరువాత కుటుంబ ఆర్థిక కారణాల వల్ల అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వడివేలు అక్కడ 15 రోజులపాటు చిక్సి పొందుతూ మరణించాడు. దురైలో జన్మించిన ఈ నటుడు 1991 లో విడుదలైన ఎన్ రాసవిన్ మనసిలే అనే చిత్రంతో తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టారు. ప్రముఖ హాస్యనటుడు వడివేల్‌ను అనుకరిస్తూ నటించినందుకు బాలాజీ అనేక ప్రశంసలు పొందారు.

Related posts