telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

విధులకు డుమ్మా కొట్టి వన భోజనాలకు అధికారులు .. సస్పెన్షన్‌తోపాటు షోకాజ్ నోటీసులు ..

collector suspended ICDS employees on

ఐసీడీఎస్ సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి వన భోజనాలకు వెళ్లడం పై సూర్యాపేట కలెక్టర్ సస్పెన్షన్‌తోపాటు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సూర్యాపేట అర్బన్ ప్రాజెక్టులోని ఓ సెక్టార్‌కు చెందిన అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, ఆయాలు కలిసి సీడీపీఓ కమలప్రియ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో చివ్వెంల మండలం బీబీగూడెం శివారులోని ఓ మామిడితోటలో కార్తీకమాస వన భోజనాలు చేసుకున్నారు.

విందు భోజనాలు చేసి ఆడిపాడారు. అక్కడ సరదాగా తీసుకున్న వీడియోలు వాట్సాప్‌లలో తిరగడడంతో మూకుమ్మడిగా ఓ సెక్టార్‌కు చెందిన ఐసీడీఎస్ సిబ్బంది మొత్తం వన భోజనాలకు వెళ్లినట్లు అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ విందులో సీడీపీఓ కూడా పాల్గొన్నట్లు అధికారులు గుర్తించి కలెక్టర్‌కు నివేదించగా.. కలెక్టర్ డి.అమయ్‌కుమార్ ప్రాథమిక విచారణ చేపట్టి సీడీపీఓ కమలప్రియను సస్పెండ్ చేస్తూ ఉత్తర్తులు జారీ చేశారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

Related posts