telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సర్కారు బడిలో చేరిన కలెక్టర్ కూతురు

collector daughter

సర్కారు బడిలో ఉత్తమ ఫలితాలు వస్తున్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలలపై మోజు తగ్గడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్టేటస్ అంటూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో రూ.లక్షలు ఖర్చు చేసి చదివిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఓ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం అందరిలో మార్పు కలిగించేలా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ కలెక్టర్ అయేషా మస్రత్ ఖానం సర్కారు విద్యపై ప్రభుత్వోద్యోగులకు స్ఫూర్తినిచ్చే నిర్ణయం తీసుకున్నారు. అయిదో తరగతి చదువుతున్న తన కూతురు తబిష్ రైనాను వికారాబాద్ పట్టణ శివారు శివారెడ్డిపేట్‌లోని మైనా ర్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఐదో తరగతిలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచా రు. ప్రభు త్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు కాబట్టి తన కూతురును మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించానని కలెక్టర్ మస్రత్ ఖానం తెలిపారు.

Related posts