telugu navyamedia
health trending

కొబ్బరి నూనెతో.. బరువు తగ్గండి ఇలా..ఒక్క టీ స్పూన్.. !!

coconut oil for over weight reduction

కొబ్బరి నూనెను దక్షిణ భారతంలో వంటలలో ఉపయోగించడం చాలా తక్కువ. కానీ దానిని కూడా వంటలలో వాడితే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడన్ని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అధికబరువు సమస్య ఉన్నవారికి ఈ నూనె చక్కటి పరిష్కారం అంటున్నారు వారు. రోజు తగిన పరిమాణంలో ఈ నూనెను తీసుకోవడం వలన ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. కొబ్బరినూనెపై దాదాపుగా 1500కు పైగా చేసిన అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. దీనిని రోజూ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..

* 40 నుంచి 60 కిలోల లోపు బరువు ఉన్న వారు నిత్యం 3 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను డైరెక్ట్‌గా అలాగే తాగవచ్చు. కానీ ఒకేసారి తాగకూడదు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు ఒక్కో టేబుల్ స్పూన్ మోతాదులో ఈ నూనెను తాగాలి.
* 61 నుంచి 80 కిలోల మధ్య బరువు ఉన్న వారు నిత్యం 4.5 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను తీసుకోవచ్చు. అయితే ఒక్కో పూట 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను భోజానికి ముందు తీసుకోవాలి.
* 81 కిలోలు ఆపైన బరువు ఉన్న వారు నిత్యం 6 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరినూనె తాగవచ్చు. ఒక్కో పూట 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను భోజనానికి ముందు తాగాలి.

ఏ కొబ్బరి నూనె తాగాలి..? :
* ఎక్స్‌ట్రా వర్జిన్ లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని దొరికే కొబ్బరి నూనె మాత్రమే వాడాలి. ఇవే స్వచ్ఛమైన కొబ్బరినూనె కిందకు వస్తాయి.
* కొబ్బరినూనెను పైన తెలిపిన విధంగా డైరెక్ట్‌గా తాగలేకపోతే సలాడ్స్, చక్కెర లేని పండ్ల రసాలు, హెర్బల్ టీలు తదితర ఆహారాల్లో కలుపుకుని కూడా తాగవచ్చు.
* కొబ్బరినూనెను తాగడం మొదలు పెట్టిన ఆరంభంలో వాంతికి వచ్చినట్టు ఉండడం, విరేచనాలు కావడం జరుగుతుంది. ఇవి సహజమే. అయితే తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే కొబ్బరినూనెను వాడకూడదు. పైన చెప్పిన డోస్ కన్నా ఇంకా తక్కువ మొత్తంతో తాగి ఆయా అనారోగ్య సమస్యలు కనిపించకపోతే నెమ్మదిగా డోస్‌ను పెంచవచ్చు.

పైన చెప్పిన విధంగా కొబ్బరినూనెను తీసుకుంటే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయంటే :
1. కొబ్బరినూనెను రోజూ తాగడం వల్ల అందులో ఉండే మీడియం చెయిన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీనితో థైరాయిడ్ సమస్య పోతుంది. అధిక బరువు తగ్గుతారు. శరీరంలో కరగకుండా ఉన్న ఎంత మొండి కొవ్వు అయినా సరే ఇట్టే కరిగిపోతుంది.

2. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. మధుమేహం అదుపులో ఉంటుంది.

3. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చర్మంపై ఏర్పడే మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.

4. గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. శిరోజాలు దృఢంగా, ప్రకాశవంతంగా మారుతాయి.

5. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

6. కొబ్బరినూనెలో సహజసిద్ధమైన యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి.

7. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండవచ్చు. శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఎంత పనిచేసినా త్వరగా అలసిపోరు. రోజు మొత్తం యాక్టివ్‌గా ఉంటారు.

8. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్దకం బాధించవు.

Related posts

బీజేపీలోకి నయన్… మంత్రిని కలిసిన లేడీ సూపర్ స్టార్

vimala p

టీవీ, సినిమా రంగంపై ఆసక్తి ఉన్నవారికి… ఉచిత శిక్షణ…

vimala p

‘క్రాక్’ తెప్పిస్తున్న కటారి… సముద్రఖని ఫస్ట్ లుక్ విడుదల

vimala p