telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

అంగరక్షకుడిగా.. బొద్దింక.. ఆ దేశ అధ్యక్షుడికి అదే.. నచ్చిందట..

cockroach as guard to president

సామజిక మాధ్యమాలలో ఒక వార్త వస్తే దానిని రకరకాలుగా మర్చి, ఆ వార్త అసలు స్వరూపాన్ని మార్చేస్తారు. ఇది ఇప్పటికే నిరూపించబడింది. సమాచారం ప్రసారంలో మాధ్యమాలు ఎక్కువైనప్పుడు.. ఆ సమాచారం లో ప్రధాన విషయం మారిపోతుంది. ఇక వార్త విషయానికి వస్తే, ఒక సభలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టో ప్రసంగానికి ఓ బొద్దింక ఆటంకం కలిగింది. అప్రమత్తమైన సిబ్బంది దాన్ని ఆయన టీ షర్ట్ నుంచి కిందపడేశారు. క్యాంపెయిన్ ర్యాలీలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా బొద్దింక ఒక్కసారిగా ఆయన ఎడమ చేతి మీద నుంచి భుజం వరకు పాకింది.

ఆయన పక్కనున్న మహిళా సహాయ సిబ్బంది ఒకరు వేగంగా వచ్చి దాన్ని ఒక ఫైల్ సాయంతో దులిపేసింది. ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగానే ఇదంతా జరిగింది. దీనిపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ఈ కాక్రోచ్‌ను ప్రతిపక్ష పార్టీ పంపించిందని వ్యాఖ్యానించడంతో సభలో ఉన్నవారంతా నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానితో అర్ధం మారిపోయింది.

Related posts