telugu navyamedia
andhra culture news

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు!

rain effect

రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని, కొమెరిన్‌ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు భారీగా వీస్తాయని తెలిపింది.

అలాగే, కోస్తా, రాయలసీమలలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, నిన్న కూడా కోస్తాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

Related posts

తెలంగాణ ప్రజలంతా రేపు 5 గంటలకు చప్పట్లు కొట్టండి: కేసీఆర్

vimala p

అక్టోబర్ 27లోపే .. ఆ రాష్ట్రాలలో ఎన్నికలు .. కేంద్ర నిర్ణయం..

vimala p

‘ఆపండి’ అంటూ వధువు కేక..ఆగిన పెళ్లి!.

vimala p