telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైద్య సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలి: సీఎం జగన్‌

cm jagan ycp

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్‌ సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వైరస్‌ నియంత్రణపై సమీక్షలో ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని అధికారులకు సూచించారు. ఎనిమిది జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతమున్న ఐసోలేషన్‌ పడకలు, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. వైరస్‌ సోకడం తప్పేమీ కాదని, నేరం అంతకన్నా కాదని అభిప్రాయపడ్డారు.

వైరస్‌ ఎవరికైనా సంభవించే అవకాశం ఉందని, పరీక్షలను స్వచ్ఛందంగా ముందుకురావాలిన సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. కనీస జాగ్రత్తలు, వైద్య సహాయంతో వైరస్‌ సోకిన బాధితులు కోలుకోవడం సులభమని అన్నారు. ఈ మేరకు ప్రతి గ్రామాల్లో ప్రజలకు అవగాహాన కల్పించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts