telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500..అక్టోబరులో పంపిణీ: వైఎస్‌ జగన్‌

jagan

ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్ తెలిపారు. రాష్ట్రంలో 1.25 ఎకరాల కన్నా తక్కువ భూమి ఉన్న రైతులు 50శాతం, 2.5 ఎకరాల కన్నా తక్కువ ఉన్న భూమి ఉన్న రైతులు 70శాతానికి పైగా రైతులు ఉన్నారని వెల్లడించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పలు కీలక ఆదేశాలను జారీ చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పండుగలా నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు.

ఈ పథకం ద్వారా లబ్ధిపొందే మొత్తాన్ని రైతులకు ఒకే రోజు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వాస్తవంగా రైతు భరోసాను మే మాసంలో ఇవ్వాల్సిఉందని, కానీ రైతుల దుస్థితిని చూసి అక్టోబరులోనే రబీ సీజన్‌ కోసం ఇస్తున్నామని సీఎం తెలిపారు.రైతు భరోసా కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కౌలు రైతులకు కూడా రూ.12500 ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

Related posts