telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విద్యార్థులకు సీఎం జగన్ బంపరాఫర్..

cm jagan

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మ ఒడి పథకంలో భాగంగా రెండో విడత చెల్లింపులను సీఎం జగన్‌ ప్రారంభించారు. నెల్లూరు జిల్లాలోని వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో రెండో విడత అమ్మ ఒడిలో భాగంగా 6 వేల 673 కోట్లను విడుదల చేశారు. మొత్తం 44 లక్షల 48 వేల 865 మంది తల్లుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేశారు. పిల్లలను చదివించే శక్తి లేక చాలా మంది తల్లులు వారిని కూలి పనులకు పంపడాన్ని పాదయాత్రలో చూశానని… అందుకే అమ్మ ఒడి పథకానికి రూపకల్పన చేశామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పిల్లలను బడికి పంపే తల్లికి 15 వేలు ఇచ్చామని… ఇప్పుడు రెండో విడత అమలు చేస్తున్నామని తెలిపారు. చదువుకోవాలనుకునే ప్రతి బిడ్డకు అమ్మ ఒడి శ్రీరామరక్ష అని జగన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కంప్యూటర్‌ స్కిల్స్‌ పెంచేందుకు ల్యాప్‌టాప్‌ ఆఫర్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు ఈ ఆఫర్‌ ప్రకటించారు. అమ్మ ఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్టాప్‌ ఇస్తామని తెలిపారు. 4 జీబీ ర్యామ్‌, విండోస్‌ 10 ఓఎస్‌ ఫీచర్స్‌తో ల్యాప్‌టాప్‌ ఉంటుందని సీఎం జగన్‌ వివరించారు.

Related posts