telugu navyamedia
రాజకీయ వార్తలు

ఎన్నో భాషలను నేర్చుకోవచ్చు.. మాతృభాషను మరువరాదు: మమత

BJP compliant EC West Bengal

హిందీ భాషా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ ప్రజలకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. అన్ని భాషలను, సంస్కృతులను సమానంగా గౌరవించాల్సిన అవసరముందని ఆమె ఈ సందర్బంగా పేర్కొన్నారు. అన్ని భాషలను, సంస్కృతులను మనం సమానంగా గౌరవించాల్సిన అవసరముంది. మనం ఎన్నో భాషలను నేర్చుకోవచ్చు కానీ, మాతృభాషను మరువరాదని ఆమె ట్వీట్‌ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా హిందీ దివస్‌ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తదితరలు హిందీ దివస్‌ సందర్భంగా ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ఏకీకృత భాషగా హిందీని అమలు చేయడం ద్వారా దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తీసుకురావచ్చన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Related posts