telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మమతా బెనర్జీకి కేజ్రీవాల్ మద్దతు…

arvind-kejriwal

మమతా బెనర్జీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. పశ్చిమ బెంగాల్ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. రాష్ర్టాల హక్కులను కేంద్రం హరిస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను డిప్యూటేషన్‌పై కేంద్ర విధుల్లోకి తీసుకోవడం సమాఖ్యవాదంపై దాడి చేయడం, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడి ఘటనతో ఈ వివాదానికి తెరలేచింది. ఆ సమయంలో నడ్డా భద్రతా ఏర్పాట్లకు బాధ్యులైన ఎస్పీ, డీఐజీ, ఏడీజీని వెంటనే రిలీవ్‌ చేయాలని బెంగాల్‌ను కేంద్రం తాజాగా ఆదేశించింది. అయితే, రాష్ట్రం నుంచి ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను కేంద్రానికి కేటాయించలేమని ఈ నెల 12న బెంగాల్‌ ప్రభుత్వం తెలియజేసింది. వారు ముగ్గురూ పశ్చిమ బెంగాల్‌ క్యాడర్‌కు చెందినవారే. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి లేఖ రాస్తూ ముగ్గురు ఐపీఎస్‌లను డిప్యూటేషన్‌పై పంపాల్సిందేనని స్పష్టం చేసింది.

Related posts