telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బస్తీ దవాఖానాల పనితీరుపై కేసీఆర్‌ సంతృప్తి

KCR cm telangana

హైదరాబాద్‌ నగరంలో ఉన్న బస్తీ దవాఖానాలపై సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు నివసించే బస్తీల్లో మరిన్ని దవాఖానాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నగర జనాభా అంతకంతకూ పెరుగుతోందని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దవాఖానాలు కూడా పెరిగితేనే ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. ప్రస్తుతం నగరంలో ఉన్న 118 బస్తీ దవాఖానాల సంఖ్యను 350 వరకు పెంచాలని అధికారులను ఆదేశించారు.

నగరంలో కాలుష్యాన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాలుష్యాన్ని నియంత్రించకుంటే జనజీవనం నరకప్రాయంగా మారే అవకాశం ఉందన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి పట్టణాల్లో వార్డుకొకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ బడ్జెట్లలో పదిశాతం నిధులను మొక్కలు, పచ్చదనం పెంచడానికి ఉపయోగించాలన్నారు.

Related posts