• Home
  • వార్తలు
  • ముందస్తుకే కేసీఆర్ మొగ్గు..డిసెంబర్ లో ముహూర్తం?
రాజకీయ వార్తలు వార్తలు

ముందస్తుకే కేసీఆర్ మొగ్గు..డిసెంబర్ లో ముహూర్తం?

is kcr dream of early elections comes true

తెలంగాణలో గత కొద్దిరోజులుగా ముందస్తు ఎన్నికల వేడి కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన స్పష్టతతో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు పార్టీ నేతలు ఎన్నికలకు సిద్ధం కావాలని సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎన్నికలకు డిసెంబర్ ముహూర్తంపై చర్చ జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు రాజీవ్ శర్మ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతో భేటీ అయిన విషయం తెలిసిందే.

ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రగతి నివేదన సభలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్‌లో అన్ని స్థానాలూ గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చేదీ తనకు కూడా తెలియదని, ఎప్పుడైనా జరగొచ్చని, పార్టీ నేతలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.సెప్టెంబరు 2న జరిగే ప్రగతి నివేదన సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని, ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 25వేల మంది హాజరయ్యేలా చూడాలని నేతలను ఆదేశించారు.

Related posts

సైకిల్ పై ఏనుగు సవారీ సాధ్యమా !?

admin

బేవార్స్ మూవీ ప్రెస్ మీట్ ‘చిత్రాలు’..

chandra sekkhar

డి.ఎస్. సొంత గూటికి…తెరాస లో విలువ లేదని…

chandra sekkhar

Leave a Comment