telugu navyamedia
political Telangana

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్‌

pocharam namination for speaker
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని ఆయన స్వగ్రామం పోచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. పోచారం తల్లి పాపవ్వ(107) మంగళవారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. నిన్న ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఇవాళ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బాన్సువాడ చేరుకుని అక్కడి నుంచి  రోడ్డుమార్గం ద్వారా పోచారం వెళ్లారు.  
స్వర్గీయ పాపవ్వ చిత్రపటానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ఎంపీ కవిత, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, గణేశ్‌ గుప్తా ఉన్నారు.

Related posts

మోడీని .. భగీరధుడు అంటున్న యోగి..

vimala p

కొత్త జిల్లాల సంఖ్య పై .. పలు అనుమానాలు..! నేడు జగన్ తేల్చనున్నాడా.. !!

vimala p

మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్, సీఎం కేసీఆర్

vimala p