telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గొర్రెల పంపిణీపై సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు..

Kcr telangana cm

కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది. దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారు. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను, అధికారులను సిఎం ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సిఎం నిర్ణయించారు. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్ లో దీనికి సంబంధించి నిధులు కేటాయించనున్నట్లు సిఎం వెల్లడించారు. కాగా.. ఈ నెల 11న ఉదయం 11.30 గంటల నుండి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతభవన్ లో సమావేశం కానున్నారు. రెవెన్యూ, పంచాయతిరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.

Related posts