telugu navyamedia
political Telangana

సీఎం కేసీఆర్ ఓటు ఎక్కడంటే?

KCR Tells Leaders Party Development
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు రేపు జరగనున్న పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.  ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన ఓటు హక్కును సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో వినియోగించుకోనున్నారు.
 కేసీఆర్ ఓటు వేసే పోలింగ్ బూత్ ను, హెలిప్యాడ్ స్థలాలను పోలీసు కమిషనర్ జోయెల్ డేవిస్ ఇవాళ పరిశీలించారు. చింతమడకలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 32,815 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

Related posts

ఈవీఎంలలో జరిగిన అవినీతి వల్ల.. వైసీపీ గెలిచే అవకాశాలే ఎక్కువ: కేఏ పాల్

vimala p

మళ్ళీ టీడీపీ-బీజేపీ కలుస్తాయి.. : అసదుద్దీన్ ఒవైసీ

vimala p

ఆ పార్టీకి అడిగినన్ని సీట్లు ఇస్తే…రాహుల్ కి .. మద్దతు ఇస్తా అంటున్న ఒవైసీ..

vimala p