telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మాజీ మంత్రి నాయిని మృతి..సీఎం కెసిఆర్ దిగ్బ్రాంతి

Kcr telangana cm

జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత శ్వాస సంబంధ సమస్యలకు గురయ్యారు. వైద్య పరీక్షల్లో న్యూమోనియా అని తేలింది. కరోనా కారణంగా కలిగిన న్యూమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాయిని ఆసుపత్రి పాలయ్యారు. ఆయన ఆరోగ్యంగా కోలుకుని తిరిగి వస్తారనే ప్రజలు అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణ వార్త ఆయన అభిమానులను, పార్టీ శ్రేణులను తీవ్ర భాదలోకి నెట్టివేసింది. అయితే..మాజీ మంత్రి శ్రీ నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయిని నర్సింహారెడ్డి గారి అంత్యక్రియలు అధికారిక లాంచనాలతో నిర్వహించాలని సీఎస్ ను ఆదేశించారు.

Related posts