telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాజ్యాంగబద్ధంగానే టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ విలీనం: కేసీఆర్

Woman candidates kcr cabinet Telangana

నిబంధనల ప్రకారమే టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ విలీనం జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో విలీనంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భట్టి వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగానే టీఆర్ఎస్‌లో కాంగ్రెస్ విలీనం జరిగిందని అన్నారు. రాజ్యాంగంలో కొన్ని నిబంధలు ఉన్నాయని, ఆ నిబంధనలకు సంబంధించే వ్యవహారాలు జరుగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షెడ్యూల్ 10 నిబంధనల ప్రకారం టీఆర్ఎస్‌లో చేరారని చెప్పారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పార్టీలో చేరతామని వచ్చినప్పటికీ, తాము చేర్చుకోలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. తమకు కావలసిన మెజారిటీ ఉందని చెప్పామన్నారు. ఇటీవల టీడీపీ రాజ్యసభ్యులు బీజేపీలో చేరిన విషయాన్ని ఈ సందర్బంగా సీఎం గుర్తు చేశారు. గోవాలో కూడా ఇలానే జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీల్లో చేరికలు జరుగుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

Related posts