telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష..

cm jagan

ఉన్నత విద్యపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా కోవిడ్‌ కాలంలో ఎనీటైం – ఎనీవేర్‌ లెర్నింగ్‌ పద్ధతిలో క్లాసులు నిర్వహించామని సీఎంకు తెలిపారు అధికారులు. 5 లక్షల ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించామని చెప్పారు అధికారులు. వీటిని ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసి మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఆలోచనలు చేయాలన్న సీఎం వైయస్‌.జగన్‌..కోవిడ్‌ కారణంగా వృథా అయిన కాలాన్ని కవర్‌ చేసే ఉద్దేశంతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకు రావొద్దని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం, యూజీసీ మార్గదర్శకాలను కూడా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలన్న సీఎం…ఈ విద్యా సంవత్సరంలో వసతి దీవెన, విద్యాదీవెన పథకాల అమలుకు ప్రణాళిక వేసుకోవాలన్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, బోధన ఉంటుందనే ఉద్దేశంతోనే ఎవరైనా ప్రైవేటుసంస్థలకు వెళ్తారన్న సీఎం…వాటిలో ప్రమాణాలు, తగినంత సిబ్బంది లేకపోతే గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 50 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా కింద, మిగిలిన 50 శాతం సీట్లు కాలేజీ కోటా కింద ఉండాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రైవేటు యూనివర్శిటీలకు నిర్వహిస్తున్న కోర్సుల ప్రకారం ఎన్‌బీఏ, ఎన్‌ఏసీ–న్యాక్‌ గుర్తింపు కూడా ఉండాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Related posts