telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలి..అధికారులను ఆదేశించిన జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు వాటర్ గ్రిడ్ పథకంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాగునీటి సమస్య పై చర్చించారు. పరిశుభ్రమైన తాగునీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.వాటర్ గ్రిడ్ పథకం మూడు దశల్లో చేపట్టాలని సూచించారు.

మొదటి దశలో శ్రీకాకుళం, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాలు, రెండో దశలో విజయనగరం, విశాఖ, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో చేపట్టాలని తెలిపారు. నీటి లభ్యత ఉన్న ప్రదేశంలోనే శుద్ధి చేసేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఉద్దానం వంటి కిడ్నీ వ్యాధుల ప్రాబల్య ప్రాంతాల్లో నీటి శుద్ధి కేంద్రాల నుంచే నేరుగా ఇళ్లకు మంచి నీటిని సరఫరా చేయాలని చెప్పారు. సమ్మర్ స్టోరేజి ట్యాంకులు, మంచినీటి చెరువుల్లో తాగునీటిని నింపిన తర్వాత కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Related posts