telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యుత్ రంగంలో అవినీతికి చోటు లేకుండా చూడాలి: సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ విద్యుత్ రంగంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థ ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సమావేశంలో డిస్కంలను నష్టాల నుంచి గట్టెక్కించే మార్గాలపై ప్రధానంగా చర్చించారు. నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు విక్రయించే వారితో ఒప్పందాలు చేసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ రంగంలో అవినీతికి చోటు లేకుండా చూడాలన్నరు. 

ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న 10వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్‌పైనా దృష్టిపెట్టాలని సూచించారు. కాలక్రమంలో ఆ ప్లాంట్‌ను విస్తరించడానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అదేవిధంగా హైడ్రో రివర్స్ పంపింగ్ ప్రాజెక్టులపైనా దృష్టిపెట్టాలని సూచించారు. కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Related posts