telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

“రైతు భరోసా” కు ఏర్పాట్లు చేయండి.. అధికారులను ఆదేశించిన జగన్

ఏపీ సీఎం జగన్ గ్రామసచివాలయాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి గ్రామసచివాలయాలు అమలులోకి రానున్నట్లు తెలిపారు.

రైతు భరోసా పథకానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 15న పథకం అమలు కానున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రకృతి, సేంద్రియ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు 237 రకాల సేవలు అందించనున్నట్లు సీఎం తెలిపారు.నూతనంగా దరఖాస్తు చేసుకున్న పింఛన్ దారులకు డిసెంబర్ నుంచి పింఛన్ అందజేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

Related posts