telugu navyamedia
andhra news political

ఉగాదికల్లా ఇళ్ల పట్టాల పంపిణీ: సీఎం జగన్

jagan

ఉగాదికల్లా ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. మంగళవారం గృహ నిర్మాణ శాఖపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇళ్లు లేకుండా ఉండకూడదని జగన్ అధికారులకు సూచించారు. ఈ ఏడాది శాచ్యురేషన్ విధానంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు.

వైఎస్ఆర్ ఇళ్ల కింద నాలుగు విడతల్లో ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. గ్రామ సచివాలయంలో లబ్ధిదారుల జాబితాను ఉంచుతామన్నారు. గతంలో చదరపు అడుగుకు రూ.1,100 ఖర్చు అయ్యేదని, దానిని రూ.2,200-2,300కు పెంచి దోచేశారని సీఎం ఆరోపించారు. . అర్బన్ హౌసింగ్‌లో ఫ్లాట్లపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సెక్ డేటా సరిచేయాలని, రీసర్వే చేయాలని ప్రధానికి లేఖ రాస్తానని తెలిపారు.

Related posts

రూటుమార్చిన చైన్ స్నాచర్లు : పురుషుల చైన్లు కూడా.. తస్మాత్ జాగర్త ! పోలీసుల హెచ్చరికలు ..

vimala p

చంపుతామని ప్రొఫెసర్ నాగేశ్వర్ కు బెదిరింపు కాల్స్!

vimala p

ఉద్యోగులకు వైఎస్‌ జగన్‌ వరాల జల్లు

vimala p