telugu navyamedia
andhra news political

సీఐ అయినా సరే తప్పు చేస్తే కఠినచర్యలు: సీఎం జగన్ వార్నింగ్

cm jagan ycp

రాష్ట్రంలో దళితుల దాడులపై ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కఠిన వ్యాఖ్యలు చేశారు. ఎస్సై అయినా, సీఐ అయినా తప్పు చేస్తే కఠినచర్యలు తప్పవని సీఎం జగన్ హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ తీరుతెన్నులు, దళితులపై పెరుగుతున్న దాడులు తదితర అంశాలపై చర్చించారు.

సీతానగరం శిరోముండనం ఘటన నేపథ్యంలో మాట్లాడుతూ గుండు కొట్టించడం వంటి చర్యలకు ఎవరూ పాల్పడవద్దని స్పష్టం చేశారు.గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి ఎంతో తేడా ఉందని, దళితులపై దాడి జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదని, ఇప్పుడు పొరపాటు చేస్తే పోలీసులను కూడా జైల్లో పెడుతున్నామని అన్నారు. ఎస్ఐని జైల్లో పెట్టిన ఘటన గతంలో ఎప్పుడూ లేదని తెలిపారు

Related posts

నిమ్మగడ్డ ప్రసాద్ తరఫున సీబీఐ కోర్టులో మెమో దాఖలు

vimala p

తెలంగాణ పోలీస్ శాఖలో కొన్ని పోస్టుల రద్దు!

vimala p

టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ..నలుగురికి గాయాలు

vimala p