telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఉల్లిని అక్రమంగా నిల్వచేస్తే కఠిన చర్యలు: సీఎం జగన్

jagan

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలనంటాయి. క్వింటాల్ ఒక్కింటికి ఉల్లి ధర అత్యధికంగా రూ.10,220 పలుకుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు రూ.40 పెరిగింది. మండుతున్న ఉల్లి ధరలపై ఏపీ సీఎం జగన్ దృష్టి సారించారు. ఉల్లిని అక్రమంగా నిల్వచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మార్కెటింగ్, విజిలెన్స్, పౌరసరఫరాల శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పెరిగిన ఉల్లి ధరల భారం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉల్లి ధరలు తగ్గేవరకు రైతుబజార్లలో కిలో రూ.25కే అందించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై పడే భారాన్ని ధరల స్థిరీకరణ నిధి నుంచి భరించాలని మార్కెటింగ్ శాఖను ఆదేశించారు.

Related posts