telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

 కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు: సీఎం జగన్

ys jagan cm

బీసీల హక్కులకు భంగం కలగకుండా జరిగే కాపు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు.కాపు కులానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కాపు రిజర్వేషన్లపై తాజా పరిణామాలను జగన్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల అంశంపై తమ వైఖరిలో ఎప్పుడూ మార్పు లేదని మరోసారి స్పష్టం చేశారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాపు రిజర్వేషన్ల అంశాన్ని వాడుకోవడానికి టీడీపీ యత్నిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు చర్యలతో కాపులు బీసీలా? ఓసీలా? అన్న పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. చంద్రబాబు నామమాత్రంగా కాపులను బీసీల్లో చేర్చడంపైనా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి ఇచ్చిన 5 శాతం కోటా పైనా కోర్టులో కేసులు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో అడుగు ముందుకేస్తే ఈ కోటా కింద సీట్లు, ఉద్యోగాలు పొందిన వారి పరిస్థితి ఏమవుతుందని జగన్ ప్రశ్నించారు.

Related posts