telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కాపు నేతలతో సీఎం జగన్ భేటీ.. త్రిసభ్య కమిటీ ఏర్పాటు!

ys jagan cm
అగ్రవర్ణ పేదలకు కేంద్రం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ లో కాపులకు ప్రత్యేకంగా 5 శాతం ఇవ్వలేమని జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం పై అధికార పార్టీలోని కాపు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ప్రతిపక్ష టీడీపీతో పాటు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. కాపులు బానిసల్లా బతకాలా? అని ఈ రోజు బహిరంగ లేఖ రాశారు. 

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు నష్టనివారణ చర్యలకు దిగింది. ఈరోజు వైసీపీ కాపు నేలతో ఏపీ సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించడం, ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై త్రిసభ్య కమిటీని నియమించింది. మంత్రి కన్నబాబు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే అంబటి రాంబాబును కమిటీ సభ్యులుగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Related posts