telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వాలంటీర్లకు ఐడీ కార్డులు అందజేసిన జగన్

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షలమంది వాలంటీర్లు ఇవాళ్టి నుంచి విధుల్లోకి వచ్చారు. విజయవాడ ఎస్‌.ఎస్‌.కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించేదే ప్రభుత్వం అని అన్నారు. అందులో భాగంగానే ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు.

ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తులనే గ్రామవాలంటీర్లుగా నియమించామని తెలిపారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ అవసరం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 50 ఇళ్లకు ఒక ఉద్యోగం ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు.ఈ సందర్భంగా వాలంటీర్లకుజగన్ ఐడీ కార్డులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.

Related posts