telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రాథమిక హక్కులు ప్రతీ ఒక్కరూ పొందాలన్నదే తమ తపన: సీఎం జగన్

cm jagan on govt school standardization

73వ స్వాతంత్య్ర దినోత్సవం భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో కల్పించినా రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక అసమానతలు నేటికి కనిపిస్తూనే ఉన్నాయన్నారు. రాజ్యాంగానికి ఆత్మగా అభివర్ణించే ప్రాథమిక హక్కులు ప్రతీ ఒక్కరూ పొందాలన్నదే తన తపన అని చెప్పుకొచ్చారు.

యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేస్తే నాన రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. దేశ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో బడుగులకు, బలహీన వర్గాలకు, మహిళలకు, మైనారిటీలకు పెద్దపీట వేస్తూ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్ర గతిని మార్చే చట్టాలను తీసుకొచ్చినట్లు జగన్ పేర్కొన్నారు. పదవుల్లోనూ గతంలో ఎన్నడూ జరగని విధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన మెుట్టమెుదటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని జగన్ స్పష్టం చేశారు.

Related posts