telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రామానాయుడుకు మాట్లాడే అర్హత లేదు : జగన్‌ ఫైర్‌

ys jagan cm

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వేడి వాడిగా జరుగుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ, ప్రతి పక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా.. అధికార, ప్రతిపక్షాల చర్చ నడుస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిపై సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారు. ఈ సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ. 3000 పెన్షన్‌ ఇస్తామన్నారు..? ఏమైందని ప్రభుత్వాన్ని రామానాయుడు ప్రశ్నించారు. దీనిపై సీఎం జగన్‌ సీరియస్‌గా స్పందించారు. సభను రామానాయుడు పదే పదే తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్‌ అయ్యారు సీఎం జగన్‌. సభలో రామానాయుడుకు మాట్లాడే అర్హత లేదని… ఆ డ్రామా నాయుడుకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దంటూ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కావాలని తప్పుదోవ పట్టించే వారిని కట్టడి చేయాలన్నారు. రామనాయుడుపై సభా హక్కుల నోటీసులు ఇవ్వాలని సీఎం జగన్‌ డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ తమ్మినేని… వాస్తవాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. సభలో వాస్తవాలను మాత్రమే చెప్పాలని సభ్యులకు స్పీకర్‌ సూచించారు. రికార్డుల నుంచి రామానాయుడు వ్యాఖ్యలను తొలిగించాలంటూ స్పీకర్‌ తమ్మినేని ఆదేశించారు.

 

Related posts