telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సున్నా వడ్డీ రుణాలపై చర్చకు సిద్ధం..చంద్రబాబుకు జగన్ సవాల్!

cm jagan on govt school standardization

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సున్నా వడ్డీపై వాడి వేడి చర్చ కొనసాగుతోంది.మొదట ఈ విషయంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు.  సున్నా వడ్డీ పథకం గొప్పగా అమలు చేసినట్టు చంద్రబాబు చెబుతున్నారు. సున్నా వడ్డీ రుణాలపై మేం చర్చకు సిద్ధం అని జగన్ సవాల్ విసిరారు.

సున్నా వడ్డీ రుణాలపై ప్రజలకు నిజానిజాలు తెలియాలన్నారు. ఇదిలా ఉంటే.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సభకు డాక్యుమెంట్ సమర్పించారు. సోషల్ ఎకనమిక్ సర్వే రిపోర్టులను చంద్రబాబు సభలో పెట్టారు. తనను రాజీనామా చేయాలని అడుగుతారా..? అని చంద్రబాబు ప్రశ్నించగా ఇందుకు వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఎలా ఉంటారో.. వారి సభ్యులు కూడా అలానే ఉంటారని విమర్శించారు.

2014లో రూ.1184 కోట్లకు గాను రూ.44.31 కోట్లు మాత్రమే చెల్లించారు. 2015లో రూ.2283 కోట్లకు గాను కేవలం 31 కోట్లు చెల్లించారు. 2016లో రూ.2354 కోట్లకు గాను రూ.249 కోట్లు చెల్లించారు. 2017-18లో రూ.2703 కోట్లకు గాను రూ.182 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఐదేళ్లలో 11600 కోట్లు ఇవ్వాల్సి ఉంటే రూ.630 కోట్లు మాత్రమే ఇచ్చారు. రైతుల రుణాలన్నీ చెల్లించామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని జగన్‌ దుయ్యబట్టారు.

Related posts