• Home
  • వార్తలు
  • తితలీ తుఫాన్ పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

తితలీ తుఫాన్ పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

AP CM Chandrababu Teleconference at Amaravati

తితలీ తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విద్యుత్‌, కమ్యూనికేషన్‌, రైల్వేలైన్లకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫాను నేపథ్యంలో కళింగపట్నంలో మూడో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో తుఫాను ధాటికి  ఇద్దరు మృత్యువాతపడ్డారు.

 తుఫాన్ సహాయకచర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నేలకూలిన చెట్లను వెంటనే తొలగించాలని, దెబ్బతిన్న రహదారులను వెంటనే పునరుద్దరించాలని ఆదేశించారు. అలాగే యుద్ధప్రాతిపదికన రాకపోకలు పునరుద్దరించాలని తెలిపారు. విద్యుత్ పునరుద్దరణ చర్యలు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని శ్రీకాకుళానికి తరలించాలని చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Related posts

సమస్యలు పరిష్కరించాలని ..బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన

madhu

భక్తి ఛానల్ చైర్మన్ గా రాఘవేంద్ర రావు

admin

గవర్నర్ పై తప్పుడు కథనం రాసినందుకు జర్నలిస్ట్‌ అరెస్ట్!

madhu

Leave a Comment