telugu navyamedia
రాజకీయ వార్తలు

పరీక్ష ఫీజులపై కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

kejriwal on his campaign in ap

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రభుత్వం ఇటీవల పలుపథకాలు ప్రవేశపెడున్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10, 12వ తరగతి విద్యార్థుల పరీక్ష రుసుమును ఈ ఏడాదికి గాను ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు పంపినట్టు తెలిపారు. 10, 12వ తరగతి పరీక్ష ఫీజులను సీబీఎస్‌ఈ ఇటీవల భారీగా పెంచిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Related posts