telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌ కోర్టుకు రాలేదు.. విజయసాయిరెడ్డి, శ్రీలక్ష్మి హాజరు

jagan

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం  జగన్ ప్రతి వారం హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో శుక్రవారం నాడు విచారణ జరిగింది. అయితే ఈ విచారణకు వైఎస్ జగన్ హాజరుకాలేదు. ఈ కేసులో విజయసాయిరెడ్డి, ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి మాత్రమే హాజరయ్యారు. ఇవాళ ఈ కేసులో 11చార్జిషీట్ల విచారణ జరిపిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ఎన్నో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ని ఉన్నందున తన వ్యక్తిగత హాజరునకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టుకు వైఎస్‌ జగన్‌ విన్నవించుకున్నారు. తన తరఫున న్యాయవాది జి.అశోక్‌ రెడ్డి హాజరయ్యేందుకు అనుమతించాలని పిటిషన్ లో కోరారు. దీనిపై ఇవాళ విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈనెల 20కు వాయిదా వేసింది.

Related posts