telugu navyamedia
ట్రెండింగ్

ఇవి సాలీళ్లట… చలికి ఇలా ..

clumb of daddy longlegs

కంటికి మొదటిగా ఏది కనిపిస్తే దానిని మస్తిష్కములో ప్రింట్ చేస్తుంది. దానితో కళ్ళతో చూసినవి కొన్ని సార్లు అసత్యాలు అవుతాయి. అలాంటి వాటికి ఈ సందర్భం చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.. క్రింద ఇచ్చిన వీడియో చూడండి.. మీరు నాతో ఏకీభవిస్తారు. ఆ వీడియోలో చూడడానికి నల్ల గా ఏమిటో కనిపిస్తుంది కదా, అది చూడగానే మీకు మొదటిగా వచ్చిన ఊహ ఏమిటి.. చెప్పండి. అదొక జంతువో, మరేదో గడ్డి అనో, లేదా ఎలుకబంటి చర్మమేమో అనిపిస్తుంది కదా. కానీ అవన్నీ నిజం కాదు, ఎందుకంటె అసలు అదేమిటో వాటిని కదుపుతే తెలుస్తుంది. ఇంతకి ఆ వీడియోలో కనిపించేవి మెక్సికో దేశంలోని స్కాంట్‌లాండ్‌లలో ఉండే ‘స్టర్ ఆఫ్ డాడీ లాంగ్ లెగ్స్’ జీవులు. అంటే, పొడవైన కాళ్లు కలిగిన సాలీళ్లు అని అర్ధం.

నల్లగా కనిపించే ఈ జీవులు ఒకే చోట గుంపులు గుంపులుగా నివసిస్తాయి. సాలీళ్ళు అన్నీ ఒక దగ్గరకు చేరి తల భాగం లోపలికి పేట్టి ఒకదాని ఒక్కటి అతుక్కొని ఉంటాయి. సాధరణ సాలిళ్ళకు మూడు నుంచి నాలుగు జతల కాళ్ళు ఉంటాయి.వీటికి ఒక జత కాళ్ళు మాత్రం ఉంటాయి. శత్రువుల రక్షించుకోవడానికి, వెచ్చదనం కోసం ఈ సాలిళ్లన్నీ ఇలా గుంపుగా ఒకే చోటకు చేరతాయి. ఈ సాలీళ్లు విషపూరితమైనవి కావు. ఇవి చాలా ప్రాచీనమైనవిగా జంతు శాస్త్రజ్ఞులు తెలిపారు. సుమారు 400 మిలియన్ ఏళ్ల నుంచి ఈ సాలీళ్లు ఉనికిలో ఉన్నాయట. వీటికి సిల్క్ గ్లాండ్స్ లేకపోవడంతో మిగితా సాలీళ్ళల గూళ్ళను నిర్మించలేవు. ఇవి తెమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నివసిస్తాయని పరిశోధకులు తెలిపారు.

Related posts