telugu navyamedia
news political Telangana

ఏ ఒక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడం లేదు: భట్టి విక్రమార్క

CLP Batti vikramarka fire KCR KTR

ఏ ఒక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తమ పార్టీకి ప్రతిపక్షం లేకుండా చేయాలని భావిస్తున్నారని భట్టి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం కల్పిస్తూ ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నట్లు తెలిపారు. కానీ ఈ కుట్రలను గుర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారని ఏ ఒక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడం లేదని తెలిపారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వ అధికారులను, పోలీస్ శాఖను ఎక్కువ వాడుకుంటున్నట్లు ఆరోపించారు.

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని పేర్కొన్నారు. తాము ఏం చేసినా అసలు ప్రశ్నించేవారే ఉండకూడదన్నట్లు ప్రభుత్వ వ్యవహారశైలి కనిపిస్తోందన్నారు. గత టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆంకాంక్షలేవీ నెరవేరలేదన్నారు .ఈసారైనా వారి ఆశలు, ఆంకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని సూచించారు. ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైన ఎలక్షన్ కమీషన్ పై తమ పోరాటం కొనసాగుతుందని భట్టి స్పష్టం చేశారు. ఈ విషయంపై త్వరలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు భట్టి వెల్లడించారు.

Related posts

ఎమ్మెల్యే ఈరన్నకు షాక్ ..సుప్రీంలో పిటీషన్‌ కొట్టివేత

vimala p

చంద్రగిరి నియోజకవర్గంలో.. మరో ఎండు చోట్ల రీపోలింగ్‌!

ashok

నటుడు మురళీమోహన్ పై .. ఈసీ కేసు, ..జయభేరి 2 కోట్లతో..

vimala p