telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కార్పొరేట్‌ సంస్థలకు తలొగ్గి ప్రభుత్వం పనిచేస్తుంది: భట్టి విక్రమార్క

Bhatti-Vikramarka clp

కార్పొరేట్‌ సంస్థలకు తలొగ్గి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భట్టి లేఖ రాశారు. సీఎం చింతమడక గ్రామానికి ప్రకటించిన రూ.10 లక్షల పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకల బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కార్పొరేట్‌ కాలేజీల అరాచకాలు పెరిగిపోయాయని భట్టి తీవ్రస్థాయిలో విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచించడంలేదన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రైవేటు విద్యకు పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ నేత మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆరోపించారు.

Related posts