telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

గుర్రంపోడులో ఉద్రిక్తత పరిస్థితులు…

తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య పెద్ద రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆ రచ్చ దాడులు చేసుకునే వారలు వెళ్ళింది. అయితే విషయం ఏమిటంటే… సూర్యాపేట జిల్లాలోని గుర్రంపోడు తండాలో తమ భూములు (సర్వేనంబర్ 540) కబ్జాకు గురయ్యాయంటూ గత కొంతకాలంగా పలువురు గిరిజనులు ఆందోళన చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకునేందుకు బీజేపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బిజేపి బృందం గుర్రంపోడుతండాకు బయలుదేరింది. సంజయ్‌, విజయశాంతిలతో పాటు కమలం నేతలు ర్యాలీగా వెళ్లారు. దింతో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇదే సమయంలో గిరిజన యాత్రకు స్థానికులు కూడా భారీగా తరలివచ్చారు. దింతో గుర్రంపోడులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ గిరిజన యాత్రలో భాగంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాట ఘర్షణకు దారి తీసింది. అక్రమ కట్టడాలు నిర్మించారంటూ స్థానికులు గుర్రంపోడులోని షెడ్డులను ధ్వంసం చేశారు. అంతేకాకుండా పోలీసులపై పలువురు ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. చుడాలిమరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts