telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆది పినిశెట్టి “క్లాప్‌” ఫస్ట్ లుక్

Clap

సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లం చిత్ర‌లో చర‌ణ్ అన్న‌య్య‌గా న‌టించి విమ‌ర్శ‌ల‌కుల ప్ర‌శంస‌లు పొందాడు ఆది పినిశెట్టి. ప్ర‌స్తుతం నూత‌న ద‌ర్శ‌కుడు పృథ్వి ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో స్పోర్ట్స్ జోన‌ర్ చేస్తున్నాడు ఈ జోన‌ర్‌లో ఆది పినిశెట్టి న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ చిత్రం అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ కాగా, ఇందులో ఆది అథ్లెట్‌గా మారే క్ర‌మంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చూపించ‌నున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఆది పినిశెట్టి హీరోగా పృథ్వీ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం “క్లాప్‌”. ‘ది సౌండ్ ఆఫ్ స‌క్సెస్’ అనేది ఉప శీర్షిక‌. రామాంజ‌నేయులు జ‌వ్వాజి, ఎం.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. క్రీడా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం తుది ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం సినిమా ఫైన‌ల్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి రెండు భిన్న పార్శ్వాలున్న పాత్ర‌లో న‌టిస్తున్నారు. శ‌నివారం ఆది పినిశెట్టి పుట్టిన‌రో్జు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Related posts