telugu navyamedia
రాజకీయ వార్తలు

సీజే రంజన్‌ గొగోయ్ పదవి విరమణ

Ranjan -Gogoi supreme

ఎన్నో కీలక తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్‌ గొగోయ్ ఆదివారం పదవి విరమణ చేశారు. 2018 అక్టోబర్‌లో 46వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన మొత్తం 13 నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు. ఎన్నో చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన ఆయన నేతృత్వంలోనే సుధీర్ఘకాలంపాటు సాగిన అయోధ్య వివాదానికి ముగింపు పలికారు.

రాఫెల్, శబరిమలకు మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లు, ‘చౌకీ దార్ చోర్ హై’ అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన తన తీర్పులను వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి పదవి చేపట్టిన ఆయన తన చివరి పనిదినాన్ని తిరుమలలోనే గడపడం గమనార్హం.

Related posts