telugu navyamedia
విద్యా వార్తలు

సివిల్స్‌లో టాపర్‌గా శృతి శర్మ..

*సివిల్స్‌ 2021 ఫలితాల వెల్లడి.
*సివిల్స్ లో టాప్‌-4లో యువతులే హ‌వా  ..
*టాపర్‌గా శృతి శర్మ..అంకిత అగర్వాల్.. రెండో ర్యాంక్, గామిని సింగ్మా
మూడో ర్యాంక్ఐశ్వర్య వర్మ.. నాలుగో ర్యాంక్

సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమ‌వారం విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్‌కు మొత్తం 685 మందిని యూపీఎస్‌సీ ఎంపిక చేసింది. సివిల్స్ ఫలితాల్లో తొలి నాలుగు స్థానాల్లో అమ్మాయిలే నిలిచారు. .

న్యూఢిల్లీకి చెందిన శృతి శర్మ ఆల్‌ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. అంకిత అగర్వాల్.. రెండో ర్యాంక్, గామిని సింగ్మా.. మూడో ర్యాంక్, ఐశ్వర్య వర్మ.. నాలుగో ర్యాంక్ సాధించారు.

శ్రుతి శర్మది వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. అందుకే హిస్టరీనే ఆప్షనల్‌గా ఎంచుకని సివిల్స్ క్రాక్ చేశారు.

డిగ్రీ పూర్తైన తర్వాత శ్రుతి శర్మ.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లో సీటు సంపాదించారు. అక్కడే సివిల్స్‌ రాయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆమె జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ లో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారు.

సివిల్స్‌ టాపర్‌ నిలిచిన శృతి శర్మ మాట్లాడుతూ..సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధిస్తాన‌ని అనుకున్నానని.. అయితే ఫస్ట్ ర్యాంక్ మాత్రం ఊహించలేదంటున్నారు శ్రుతి శర్మ. .ఈ విషయం తెలిసి చాలా ఆశ్చర్యపోయానంటున్నారు

DU women graduates secure top ranks in UPSC exam - Rediff.com India News

తాను ఎక్కడ తన ఆనందాలను వదులుకోలేదని… ప్లాన్డ్‌గా చదివాన‌ని శ్రుతి తెలిపారు . ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదివాను. అయితే మెయిన్స్‌ రాసేముందు కోచింగ్‌ మెటీరియల్‌పై ఆధారపడకుండా వార్తాపత్రికల ఆధారంగా సొంత నోట్స్‌ తయారు చేసుకున్నా. అదే నాకు మేలుచేసింది. ఎన్నిగంటలు చదువుతున్నామన్నది ముఖ్యం కాదు. ఎంత నాణ్యంగా చదువుతున్నామన్నదే ముఖ్యమ‌ని అమె వెల్ల‌డించారు.

 

Related posts