telugu navyamedia
సినిమా వార్తలు

“రౌడీ” బ్రాండ్ పై అమెజాన్ కు కోర్టు ఆదేశం

flipkart and amazon offers soon
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గత ఏడాది జూలైలో “రౌడీ” అనే దుస్తుల బ్రాండ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ కు యూత్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. అయితే ఆ బ్రాండ్ పేరుతో స్థానిక వ్యాపారస్తులు నకిలీ దుస్తుల్ని రూపొందిస్తున్నారు. బెంగుళూరుకు చెందిన కొందరు వ్యాపారస్తులు ప్యాకేజీలపై విజయ్ ఫోటోను పెట్టి “జనరిక్” పేరుతో ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో అమ్ముతున్నారు. ఈ క్రమంలో అమెజాన్‌లో “రౌడీ” బ్రాండ్‌ను అమ్ముతున్నారని “రౌడీ” అభిమానులు,  మేనేజర్లు గుర్తించారు.
ఇటీవల “రౌడీ” ప్రైవేట్‌ లిమిటెడ్ బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టులో దావా వేసింది. అమెజాన్‌లో నకిలీ ‘రౌడీ’ దుస్తుల అమ్మకం జరుగుతోందని ఆధారాలతో కోర్ట్ కు సమర్పించింది. విజయ్‌ ఫొటోను ప్యాకింగ్‌లో ఉంచి పబ్లిసిటీకి ఉపయోగిస్తున్నారని దావాలో పేర్కొంది. ఈ మేరకు కోర్టు విజయ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అమెజాన్ లో నకిలీ “రౌడీ” బ్రాండ్‌ను అమ్మకూడదని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ మార్చి 29న జరగనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో నకిలీ “రౌడీ” బ్రాండ్ దుస్తులను అమ్ముతున్న వ్యాపారస్థులపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఈ సమస్య వచ్చింది. విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వ్యాపారస్తులు.

Related posts