telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులు

rtc bus hyd

ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సిటీలో బస్సులు నడిపేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం హైదరాబాదులో ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో నేటి నుంచి బస్సులు నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంటూ కొన్ని కండీషన్లు పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నేటి నుంచి హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ అనుమతించారు.

ఉద్యోగులు తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపిస్తేనే బస్సులోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని 32 రూట్లలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే సాధారణ ప్రజలకు కూడా సౌకర్యం కల్పిస్తారనే అంచనాలున్నాయి. జూన్ 1 నుంచి ప్రజలందరికీ బస్సు సౌకర్యం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts