telugu navyamedia
telugu cinema news

యువతిపై అత్యాచారం చేసిన సినిమాటోగ్రాఫర్ అరెస్ట్

Cinematographer

మీటూ ఉద్యమం సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపినప్పటికీ యువతులు ఇంకా మోసపోతూనే ఉన్నారు. తాజాగా సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఓ సినిమాటోగ్రాఫర్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లో బోడుప్పల్ కు చెందిన ఓ యువతీ సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే షణ్ముఖ్‌ వినయ్‌ అనే సినిమాటోగ్రాఫర్ ఆమెకు సినిమా అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఈ నేపథ్యంలో మాదాపూర్ లోని ఓ గెస్ట్ హౌస్ కు యువతిని రప్పించిన వినయ్, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించకుండా ఉండేందుకు పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టాడు. చివరికి పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేయడంతో వినయ్ పై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో వినయ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, రేప్ కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాలతో నిందితుడిని రిమాండ్ కు తరలించారు.

Related posts

అదృశ్యం ట్రైల‌ర్ లాంచ్‌…

vimala p

ఓ ప్రియతమా . . ! నా ప్రాణమా . . ! 

vimala p

మొగుడా వెళ్ళిపోతున్నాను… సినీనటి సూసైడ్ నోట్

vimala p